● 188 కేసులు నమోదు
కర్నూలు: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డీటీసీ శాంతకుమారి ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1,178 కాంట్రాక్టు క్యారేజీ బస్సులను తనిఖీ చేసి 188 కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆరు బస్సులను సీజ్ చేశారు. రూ.35,12,130 నగదు జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ డ్రైవ్‌ను కొనసాగిస్తామని డీటీసీ శాంతకుమారి తెలిపారు.


