నగదు లేక ఖాళీగా ఉన్న ఏటీఎం కేంద్రం
కర్నూలు నగరంలో కొన్ని ఏటీఎం సెంటర్లు మూతపడ్డాయి. మరికొన్ని తెరిచి ఉంచినా డబ్బు అంతంతమాత్రమే ఉండటంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నగదు కొరతతో కర్నూలులోని కలెక్టరేట్, గాయత్రీఎస్టేట్, బుధవారం పేట, పెద్దాసుపత్రి, యూకాన్, సెంట్రల్ ప్లాజాల్లోని ఏటీఎం కేంద్రాల్లో ఈ దుస్థితి ఏర్పడింది. బ్యాంకు అకౌంట్లలో జమ అయిన వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


