● రుద్రవరం వద్ద ఆటో బోల్తా
● ఒకరు దుర్మరణం..పలువురికి గాయాలు
పాములపాడు: జూపాడుబంగ్లా మండలంలోని తర్తూరు గ్రామంలో జరిగే తిరునాలకు వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. ఆత్మకూరు మండలం నాగలూటి గూడెం చెందిన ఆరుగురు ఆటోలో తర్తూరు తిరునాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆటోను డ్రైవర్ పులిచెర్ల బయ్యన్న వేగంగా నడుపుతూ రుద్రవరం వద్ద ఎన్‌హెచ్ 340సీ ఫ్లైఓవర్ వంతెనపై డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో అందులోని వారికి గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైదశాలకు తరలించగా నిమ్మల బయమ్మ అనే మహిళ మృతి చెందారు. గుర్రప్ప, అంకమ్మ అనే మరో ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.


