● కురువ సంఘం నేతలు
కర్నూలు(అర్బన్): వివాహ పరిచయ వేదికలతో ఉపయోగం ఉందని కల్లూరు తహసీల్దార్ కే ఆంజనేయులు, ఎకై ్సజ్ సీఐ మంజుల అన్నారు. ఆదివారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని ఎంపీపీ హాల్‌లో జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక, హిందూపురం, అనంతపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కురువ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లల ను బాగా చదివించి మంచి ప్రయోజకుల ను చేయాలన్నారు. గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షులు కేఏ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా ఎంతో మందికి వివాహాలు జరిగాయన్నారు. సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 2003 నుంచి కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు 2500 మందికి వివాహాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం కార్యదర్శి అనితాలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు బిల్డర్ వెంకటేశ్వర్లు, కోశాధికారి కేసీ నాగన్న, పరిచయ వేదిక కన్వీనర్ ఎల్లయ్య, కల్లూరు సహకార సొసైటీ అధ్యక్షులు పర్ల శేఖర్, నాయకులు కేటీ ఉరుకుందు, కత్తి శంకర్, పిల్లిగుండ్ల నాగన్న, అల్లబాబు, నాగరాజు, బూదురు లక్ష్మన్న, తవుడు శ్రీనివాసులు, బీ రామకృష్ణ, కే వెంకటేశ్వర్లు, తిరుపాలు, దివాకర్, గోపాల్, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.


