కర్నూలు కల్చరల్: డ్రోన్ టెక్నాలజీతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెంకట బసవరావు అన్నారు. ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలు సంయుక్త భాగస్వామ్యంతో రాయలసీమ యూనివర్సిటీలో 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న డ్రోన్ టెక్నాలజీపై స్కిల్ డెవలప్‌మెంట్ పోగ్రాం శుక్రవారం ముగిసింది. ఐదు రోజుల సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు వీసీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రిన్సిపాళ్లు విశ్వనాథ్ రెడ్డి, వెంకట సుందరానంద, పోగ్రామ్ కో–ఆర్డినేటర్లు శరత్‌కుమార్, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు


