నంద్యాల(అర్బన్): ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం పెద్దకొట్టాల గ్రామంలో చోటు చేసుకుంది. అయ్యలూరు మెట్టకు చెందిన శంకర్(45) ఇటుకల లోడ్‌తో పెద్దకొట్టాల మీదుగా కొత్తపల్లె గ్రామానికి వెళుతున్నాడు. పెద్దకొట్టాల చర్చి వద్ద మట్టి కుప్పపై ట్రాక్టర్ ఎక్కడంతో ప్రమాదవశాత్తు డ్రైవింగ్ సీటులో ఉన్న శంకర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.


