దేవనకొండ: కప్పట్రాళ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో రాష్ట్ర ఈగల్ ఐజీ రవికృష్ణ దంపతులు పాల్గొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఫ్యాక్షన్‌కు మారుపేరుగా ఉన్న కప్పట్రాళ్ల గ్రామాన్ని గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన రవికృష్ణ దత్తత తీసుకుని రూపురేఖలు మార్చిన విషయం విధి తమే. స్వయంగా రవికృష్ణ దంపతులు గ్రామానికి చేరుకుని ఆలయంలో సీతారాములకు ప్ర త్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రప్రభుత్వం అమలు చేయతలపెట్టిన వీబీజీ రామ్ జీ కొత్త పథకం మే నెల 1వ తేదీ నుంచి అమలు కానుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కొత్త పథకం ఏప్రిల్ 1 నుంచే అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మే 1వ తేదీ నుంచి ఈ పథకం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు అందాయి.
ఎన్‌క్యూఏఎస్ బృందం తనిఖీ
దేవనకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్యూఏఎస్) బృందం తనిఖీ చేసింది. బృందం సభ్యులు డాక్టర్ అజయ్‌కుమార్, డాక్టర్ రవి ఆసుపత్రిలోని ప్రసవ గది, రక్త నమూనా పరీక్ష కేంద్రం, ఓపీడీ, ఐపీడీ విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యాధికారులు విజయ్‌భాస్కర్, కళ్యాణ్, సీహెచ్‌ఓ భాగ్యలక్ష్మి ఉన్నారు.
మెడికల్ షాపులో చోరీ
డోన్ టౌన్: పట్టణంలోని పాతపేటలో ఉన్న ఓ మెడికల్ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఈ దుకాణంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడి, షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. క్యాష్ బాక్స్‌లో ఉన్న రూ.6 వేల నగదును ఎత్తుకెళ్లారు. దుకాణం యజమాని రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం షాపు మూసివేసి వెళ్లగా, శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు విరిగి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.


