ఆలోచన సామర్థ్యం పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆలోచన సామర్థ్యం పెంచుకోవాలి

Mar 28 2026 7:24 AM | Updated on Mar 28 2026 7:24 AM

కర్నూలు సిటీ: పోటీ ప్రపంచంలో విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ట్రిపుల్‌ఐటీ డీఎంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో కృష్ణహాల్‌లో పరిశ్రమ–విద్యా సంస్థల సమావేశం నిర్వహించారు. ఇన్ఫోసిస్‌ ఏవీపీ అండ్‌ సీనియర్‌ ఇండస్ట్రి ప్రిన్సిపాల్‌ అశోక్‌కుమార్‌, హెచ్‌సీఎల్‌ గువి హెడ్‌ హెచ్‌ఆర్‌ కంచన్‌ ఖేడ్కర్‌, వోల్వో ఇండియా హెచ్‌ఆర్‌ అరవింద్‌ వారియర్‌, టీసీఎస్‌ సీనియర్‌ డీవీ లీడ్‌ అర్జున్‌ నాగ్‌ తదితర నిపుణులు హాజరై ఏఐ, సంబంధిత రంగాల్లో పరిశ్రమల అంచనాలు, కెరీర్‌ అవకాశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు విభిన్న ఆలోచనలతో ప్రత్యేకత కలిగి ఉండాలన్నారు. ఇంటర్న్‌షిప్‌లు, హ్యాకథాన్‌లు, సర్టిఫికేషన్స్‌, వాస్తవ ప్రాజెక్టుల ద్వారా అనుభవం పొందవచ్చని వివరించారు. ప్రోగ్రామింగ్‌, డేటా స్ట్రక్చర్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, డేటాబేస్‌లు, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ వంటి ప్రాథమిక అంశాల్లో ప్రావీణ్యం సాధించడంపై సూచనలు చేశారు. ఇంటర్వ్యూ అంచనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రిపుల్‌ఐటీ డీఎం ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement