మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పీఠాధిపతి సుబుధేంద్ర ఆధ్వర్యంలో మూలరాముల విగ్రహాలకు విశిష్ట పూజలు గావించారు. వేడుకల్లో భాగంగా శ్రీమఠంలో విశిష్ట ప్రసిద్ధి చెందిన మూడు విగ్రహాలకు శ్రీమూల రాములు, శ్రీ దిగ్విజయరామ, శ్రీజయరామ దేవుళ్ల ఉత్సమూర్తులకు గంధ లేపనం సమర్పించారు. శ్రీ మూల రామదేవుడికి తైల అభ్యంగణ, తులసి పూజ, గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాయర మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, ఆలంకరణ గావించి మంగళహారతి చేశారు. ముందుగా శ్రీమఠంలో పీఠాధిపతికి పసుపు జలాలతో, నారీకృత నీరాజనం నిర్వహించా రు. వర్షాలు సకాలంలో కురిసి, పంటలు సమృద్ధిగా పండి రైతులు, భక్తులు సంతోషంగా ఉండాలని పీఠాధిపతి అనుగ్రహ సందేశాన్ని అందించి ఆశీర్వదించారు.


