‘చిరునవ్వు’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘చిరునవ్వు’ పుస్తకావిష్కరణ

Mar 28 2026 7:24 AM | Updated on Mar 28 2026 7:24 AM

నందవరం: నాగలదిన్నె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు, రచయిత గద్వాల సోమన్న రచించిన 93వ పుస్తకం ‘చిరునవ్వు’ పుస్తకావిష్కరణ శుక్రవారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. సెయింట్‌ పాల్స్‌ విద్యా సంస్థల అధినేత గోనె ఆశీర్వాదం సతీమణి డి. వైలెట మ్మ, ఇంజనీర్‌ డా.పి. మనోజ్‌కుమార్‌, ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల ఫిజిక్స్‌ లెక్చలర్‌ ఎం.ఎల్‌ హరిప్రసాద్‌, వివిధ విద్యాసంస్థల కరెస్పాండెంట్స్‌ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం ఈ పుస్తకాన్ని గుండ్లూరు సుబ్రమణ్యంకు అంకితమిచ్చారు. అత్యల్ప కాలంలోనే 93 పుస్తకాలు ముద్రించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషి గాను ప్రముఖులు ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, డయాన రంజిత, రిబ్కా, తదితర విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement