● సుధాకర్ ఇన్‌ఫ్రా సిబ్బందికి మైనింగ్
అధికారుల వత్తాసు
పాములపాడు: ఎస్‌ఆర్ ఎంసీ కెనాల్ వేస్ట్ బిల్కు (రాళ్ల మట్టి)ను తరలిస్తున్న వారిని సుధాకర్ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సిబ్బంది దోచుకుంటోంది. ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకున్నామని, రోడ్డుపై కంకర, ఇసుక, మట్టి తదితరం తరలించే వాహనాల నుంచి రాయల్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులను నియమించి దందాకు పాల్పడుతున్నారని వాహన యజమానులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మండలంలోని కంబాలపల్లి గ్రామం వద్ద బిల్కు లోడుతో వెళ్తున్న ట్రిప్పర్లను అడ్డుకున్నారు. సుధాకర్ ఇన్‌ఫ్రా చెందిన వ్యక్తుల వెంట మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రషీద్ అహ్మద్ ఉన్నారు. ట్రిప్పర్ డ్రైవర్ల వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న యజమాని వెంకటేష్, కో ఆప్టెడ్ సభ్యుడు ముర్తుజాఅలీ, మరి కొందరు వాహన యజమానులు అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికే బిల్కు తరలించడానికి ఇరిగేషన్ శాఖకు చలానా చెల్లించామని, రాయల్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థకు రాయల్టీ చెల్లించవద్దని జీఓలో కనబరిచిన విషయాన్ని కూడా చూపించారు. అయితే సుమారు నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా మని వాహన యజమానులు తెలిపారు. స్థానిక రైతు లు శ్రీశైలం ముంపులో భూములు కోల్పోయామని అందులో తమ ఆస్తులు ఉన్నాయని, పరిహారం అప్ప ట్లో అరకొరగా ఇచ్చారని, ఇప్పుడు బిల్కు తరలిస్తే వేలల్లో వసూళ్లకు పాల్పడటం సరికాదన్నారు. దీంతో డ్రైవర్ల నుంచి తీసు కున్న సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసి, అధికారులు, రాయల్టీ వసూలు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.


