హత్య చేసి.. శవానికి నిప్పంటించిశ్రీ | - | Sakshi
Sakshi News home page

హత్య చేసి.. శవానికి నిప్పంటించిశ్రీ

Mar 24 2026 7:02 AM | Updated on Mar 24 2026 7:02 AM

గుర్తు తెలియని యువకుడి దారుణహత్య

ఎమ్మిగనూరురూరల్‌: కలుగొట్ల పంచాయతీ పరిధిలోని పొలంలో గుర్తు తెలియని యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట గ్రామానికి వెళ్లే దారిలోని శ్రీ మహలక్ష్మీ పత్తి జిన్నింగ్‌ మిల్లు ఎదురుగా ఉండే ఓ రైతు పొలంలో గుర్తు తెలియని 30 ఏళ్ల యువకుడిని చంపేసి, మృతదేహం కాళ్లు చేతులు కట్టేసి, దుప్పటిలో చుట్టి మొక్కజొన్న పొలం దగ్గరకు తీసుకువచ్చి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. యువకుడి ముఖం సగం వరకు కాలిపోయి ఉంది. కుడి చేతికి ఉంగం, ఎడమ చేతికి వాచ్‌, మె డలో పూసలదండ ఉన్నాయి. విషయం తెలుసుకున్న డీఎీస్పీ ముర్రవాడ భార్గవి, రూరల్‌, టౌన్‌ సీఐలు చిరంజీవి, శ్రీనివాసులు, రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు, నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డిలు పోలీస్‌ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి 48 గంటలు అయివుండవచ్చుని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్‌లైయితే డీఎస్పీ 9121101109, రూరల్‌ సీఐ 9121101146కు సమాచారం ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement