ఆదోని సెంట్రల్: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ (ఎన్‌బీఏ) న్యూఢిల్లీ సంస్థ నుంచి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. చిన్నపురెడ్డి సోమవారం తెలిపారు. జాతీయ స్థాయి నిపుణుల బృందం గత ఏడాది డిసెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు కళాశాలను సందర్శించారన్నారు. విద్యా ప్రమాణాలు, బోధన విధానాలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు మొదలగు వాటిని సమగ్రంగా పరిశీలించారని తెలిపారు. అనంతరం డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సుకు 2026 జనవరి నుంచి 2028 డిసెంబర్ వరకు ఎన్‌బీఏ సంస్థ అక్రిడేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో విద్యార్థులు, అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు.


