కొత్తపల్లి: జలాధివాసం వీడిన సంగమేశ్వరాలయంలో ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టారు. ట్రాక్టర్ డోజర్‌తో బురదను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఆలయంలోని బురద నీటిని మోటర్ల ద్వారా బయట కు పంపింగ్ చేశారు. గర్భాలంయలో బురద తొలగించి పూర్తిస్థాయిలో సంగమేశ్వరుడిని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేస్తామని పురోహితుడు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
ఆదోని రూరల్: బైచిగేరి గ్రామానికి చెందిన చాకలి వీర హుసేని(25) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన చాకలి శాంతితో ఏడేళ్ల క్రితం వీర హుసేనికి వివాహమైంది. కుటుంబ కలహాలతో భర్తతో, మామ తిక్కన్న, అత్త రాములమ్మతో గొడవపడిన శాంతి మూడేళ్లుగా కాపురానికి రాకుండా దూరంగా ఉంది. పెద్దలు పలుమార్లు పంచాయతీ చేయగా కాపురానికి రాకపోవడంతో భర్త చాకలి వీర ఉసేని మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఉన్న తీర్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


