జిల్లాలో తగినన్ని గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జిల్లాలో 11 వేల సిలిండర్లు నిల్వ ఉన్నాయి. వీటికి అదనంగా మరో 7 వేల సిలిండర్లు వచ్చాయి. ప్రతిరోజు సగటున సుమారు 10 వేల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు సరిపడేంత సరఫరా కొనసాగుతోందన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. – నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు


