ఆన్‌లైన్‌లోనే పదవీ విరమణ ప్రయోజనాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రపోజల్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు) ఇక నుంచి ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. పెన్షన్, గ్రా ట్యుటీ, జీపీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్ ఎంకాష్మెంట్ ప్రయోజనాలు కామన్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధంగా ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నెంబరు 10 జారీ చేసింది. ఇప్పటి వరకు రిటైర్మెంటు బెనిఫిట్స్ కోసం మాన్యువల్‌గా ప్రపోజల్స్ పంపుకోవాల్సి ఉంది. ఈ నెల 14 నుంచి నిధి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. పదవీ విరమణకు 5 నెలలు ముందే ఆటో అప్లికేషన్ జనరేట్ అవుతుందని, పీఆర్‌ఎస్‌వి– సర్వీస్ వెరిఫికేషన్ రెండేళ్లు ముందే తప్పనిసరి చేసిందని జిల్లా ట్రెజరీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జీపీఎఫ్ బిల్లులను డీడీవోలు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఆప్‌లోడ్ చేస్తున్నారు. ఇకపై వీటిని కూడా డీడీవోలు నిధి పోర్టల్ ద్వారానే అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఆటో డ్రైవర్ దుర్మరణం
ప్యాపిలి: పట్టణ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ప్యాపిలికి చెందిన ఆటో డ్రైవర్ భవనాసి మధుసూదన్ (34) తన ఆటోలో (ఏపీ 39 డబ్ల్యూడీ 9756) గుత్తి నుంచి ప్యాపిలిలోకి వస్తున్నాడు. యూటర్న్ వద్ద ఎదురుగా అతివేగంతో వస్తున్న టీఎన్ 34 ఏఎఫ్ 9229 నంబర్ గల లారీ ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టడంతో ఆటో నడుపుతున్న మధుసూధన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు.
వెల్దుర్తి: ప్రముఖ శైవక్షేత్రం బ్రహ్మగుండంలో శ్రీరాముల గుడి పూజలకు నోచుకోవడం లేదు. మహాశివరాత్రి రోజు కూడా గుడి తలుపులు తెరుచుకోలేదు. నిత్యం ఆ ఆల యం మూసి ఉంటున్న విషయాన్ని ‘గర్భగుడికి తాళం’ అన్న శీర్షికన ఈనెల 16న సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు స్పందించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ రమేశ్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ హనుమంతరావ్, ఈఓ ఆంజనేయులు ఆధ్వర్యంలో మంగళవారం రాముల వారి గర్భగుడికి తాళం తెరిచి అర్చకులతో దీపారాధన ప్రారంభించారు. ఆంజనేయ సమేత సీతా, రామ, లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ రాముల వారి గుడికి అర్చకులను ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం దీపారాధన జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
సెరికల్చర్ భవనంలో
చోరీకి యత్నం
ఆత్మకూరు: పట్టణ శివారులోని కరివేన గ్రామ సమీపంలో ఉన్న సెరికల్చర్ భవనంలో చోరీకి యత్నించారు. ఈ ఆఫీసులో ఏముంటుందనుకున్నారో ఏమో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయ గది తలుపునకు రంద్ర వేశారు. ఈ భవనంలోనే ఆర్డీఓ కార్యాలయం కూడా ఉంటుంది. మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రివేళల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
చెరువులో దూకి
మహిళ ఆత్మహత్య
నంద్యాల(అర్బన్): మండల పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన మహబూబ్‌బీ (31) పట్టణ సమీపంలోని నంద్యాల చిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బి.కోడూరు గ్రామానికి మహబూబ్‌బీకి భీమవరం గ్రామానికి చెందిన షేక్ నూర్ అహమ్మద్‌తో 12 ఏళ్ల క్రి తం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. ఇటీవల కుటుంబంలో ఘర్షణలు తలెత్తా యి. దీనిని భరించలేని మహబూబ్‌బీ తల్లి వద్దకు వెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి మంగళ వారం నంద్యాల చిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి మెహరూన్ బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆన్‌లైన్‌లోనే పదవీ విరమణ ప్రయోజనాలు
ఆన్‌లైన్‌లోనే పదవీ విరమణ ప్రయోజనాలు


