పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
కర్నూలు(సిటీ): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్ జి.జయసుబ్బారెడ్డి అన్నారు. నగరంలోని టౌన్‌మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప అధ్యక్షతన వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.జయసుబ్బారెడ్డి మాట్లాడుతూ మారిన సిలబస్, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష విధివిధానాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రశ్నాపత్రాలు పూర్తిగా సీబీఎస్‌ఈ తరహాలో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. డీవీఈఓ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమావేశంలో వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


