ఆయుష్మాన్ కళాశాల వద్ద ఆందోళన
కర్నూలు(హాస్పిటల్):కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల వద్ద శుక్రవారం కొందరు విద్యార్థులు తమకు హాల్‌టికెట్లు ఇవ్వలేదని ఆందోళన చేశారు. తాము జూలై నెలలోనే పరీక్ష ఫీజు చెల్లించినా ఇప్పటి వరకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి పలు విద్యార్థి సంఘ నాయకులు భాస్కర్ నాయుడు, కటారుకొండ సాయికుమార్, కడుమూరు గిరీష్‌లు మద్దతు పలికారు. కళాశాల యాజ మాన్యంతో మాట్లాడేందు కు ప్రయత్నించగా ఆ సమయంలో అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకుని వాగ్వాదాని కి దిగారు. కళాశాల యాజమాన్యం అవినీతి, అక్రమా లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘం నాయకు లు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు ఖా జాహుసేన్,కురువ రంగన్న, పవన్,హరి పాల్గొన్నారు.


