యువకుడి బలవన్మరణం
ఓర్వకల్లు: ప్రేమ వివాహానికి కుటుంబ పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బల వన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుమ్మితం తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వేముల గ్రామానికి చెందిన జైకుమార్(25) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నాలుగు నెలల క్రితం శకునాల గ్రామానికి వచ్చాడు. గుమ్మితం తండా సమీపాన ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టులో దినసరి కూ లీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని తీవ్రమనస్తాపానికి గురైన జైకుమార్ ఈ నెల 4న పని ముగించుకొని తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి, గుమ్మితం తండా, బ్రాహ్మణపల్లె గ్రామాల మధ్యన ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. అటుగా వెళ్లుతున్న వ్యక్తులు బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించారు. ఎస్‌ఐ సునీల్‌కుమార్ తన పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలుపలికి తీశారు.


