పైసా పరిహారం అందించలేదు
ఈ ఏడాది వర్షాధారంగా 20 ఎకరాల్లో రూ.15లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టి ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చే సరికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. చేసేది లేక 20 ఎకరాల ఉల్లి పంటను పశువులకు, గొర్రెలకు మేతగా వదిలేశాను. పరిహారం ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా అందించలేదు. రైతన్న మీకోసం కార్యక్రమంతో రైతులకు ఏమి ఉపయోగమో ప్రభుత్వమే చెప్పాలి.
–పాలగిరి, వెంకటగిరి, కోడుమూరు మండలం
రెండేళ్లుగా నష్టపోయిన పంటలకు పరిహారం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఏ పంట సాగు చేసినా నష్టాలే తప్ప లాభాలు లేవు. సకాలంలో మార్కెట్లో ఎరువులు, విత్తనాలు దొరకడం లేదు. పదెకరాల్లో సాగు చేసిన పత్తి పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. రైతుల నడ్డి విరిచి రైతన్న మీకోసం అంటూ కార్యక్రమాలు నిర్వహించడం సీఎం చంద్రబాబుకే చెల్లుబాటవుతుంది.
– మహేశ్వరరెడ్డి, చనుగొండ్ల గ్రామం,
గూడూరు మండలం
పైసా పరిహారం అందించలేదు


