ప్రభుత్వ సాయం సున్నా
నేను నాలుగు ఎకరాల్లో రూ.3లక్షలకు పైన పెట్టుబడి పెట్టి ఉల్లిపంట సాగు చేశా. వర్షానికి పంట దెబ్బతినింది. మిగిలిన పంట అమ్ముకొనేందుకు వెళదామంటే రూ.200 క్వింటం అన్నారు. అవి అమ్ముకొనేందుకు తీసుకెళితే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులకు కూడా రావు అని గొర్రెలకు వదిలేశా. నష్టపోయిన ఉల్లికి హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నిస్తామనుకుంటే సమాధానం చెప్పే అధికారే లేరు.ఇప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక రూపొందించుకొని ఏమి ఆదుకొంటుంది? – హకీంబాషా ,రాళ్ల దొడ్డి గ్రామం, ఎమ్మిగనూరు మండలం


