ప్రగతి.. వెనుక‘బడి’
కర్నూలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. సమీక్షలు, నివేదికలు అంటూ విద్యాశాఖ అధికారులపై జిల్లా స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. నేడు(శుక్రవారం)మూడోసారి మోగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించనున్నారు. విద్య సంస్కరణలు అంటూ సీబీఎస్‌ఈ విద్యను, ట్యాబ్‌ల పంపిణీ రద్దు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదిలో రూ.2 వేలు కట్ చేసి రూ.13 వేలు జమ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, 1వ తరగతిలో చేరిన పిల్లలకు ఇంత వరకు జమ కాలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్‌లు నెల రోజులకే పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్తవి ఇస్తామని వెనక్కి తీసకొని ఇంత వరకు ఇవ్వలేదు. కొలతలు లేకుండా బూట్లు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు చెప్పులతోనే స్కూళ్లకు వెళ్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోఽజనం పేరుతో విద్యార్థులకు సన్న బియ్యంతో పెడుతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘నాడు– నాడు’తో 60 స్కూళ్ల రూపు రేఖలు మార్చింది. అయితే చంద్రబాబు న్రభుత్వం వచ్చి ఏడాదిన్నర్ర అయినా చివరి దశలో మిగిలిన పనులను పూర్తి చేయలేకపోయింది.
ఉపాధ్యాయులపై వేధింపులు
జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలు 2250 ఉన్నాయి. వీటిలో 4.50 లక్షల మంది విద్యార్థులు, 15,066 మంది టీచర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేటు స్కూళ్లలోను మోగా పేరెంట్స్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం మొదలైన నాటి నుంచి జూన్ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో రోజు గంటల తరబడి వెబెక్స్‌లు..టెలీకాన్ఫరెన్స్‌లు..యోగాంధ్రక రిజిస్ట్రేషన్స్ అంటూ గడిపేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియతో మరి కొంత సమయం పోయింది. జూలైలో వారం రోజుల పాటు, ఇప్పుడు వారం రోజుల పాటు మోగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మోగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలను రెండు సార్లు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి.
చంద్రబాబు సర్కార్‌లో
చతికిలబడిన చదువులు
అసంపూర్తిగా తరగతి గదుల
నిర్మాణాలు
నేడు మోగా పేరెంట్స్ 3.0 సమావేశం
ప్రగతి.. వెనుక‘బడి’


