తండ్రి మందలించాడని..
● ఇంటినుంచి పారిపోయిన విద్యార్థి
గోనెగండ్ల: పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు. ఇన్‌చార్జ్ సీఐ చిరంజీవి తెలిపిన వివ రాల మేరకు.. కులుమాల గ్రామానికి చెందిన అరెకంటి రాజు కుమారుడు ఏబేల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఐదారు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో అలిగిన ఏబేల్ ఈనెల 17వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జ్ సీఐ తెలిపారు. ఎవరికై నా ఆ బాలుడు కనిపిస్తే 9963766379 లేదా గోనెగండ్ల పోలీస్ స్టేషన్ 9121101074కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తూకాల్లో తేడాలు వస్తే చర్యలు
చాగలమర్రి: తూకాల్లో తేడలు వస్తే జిల్లా తునికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎం.జిలానీ భాషా తెలిపారు. చాగలమర్రిలోని మెయిన్ బజార్‌లో ఉన్న బంగారు దుకాణాలపై బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలు దుకాణాదారులు ఎలక్ట్రానిక్ కాటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్ర వేయించుకోకుండా ఉపయోగిస్తుండటంతో రూ.30,000 జరిమానా వేశారు. తూనికల శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో గ్రామంలోని అన్ని దుకాణాలు మూసి వేశారు. డోన్, నంద్యాల ఇన్‌స్పెక్టర్‌లు నాగరాజు, అనిత, సిబ్బంది హనుమాన్ సింగ్, మధు, శ్రీశాంత్ పాల్గొన్నారు.
తండ్రి మందలించాడని..


