వలస కూలీ మృతి
కోసిగి: మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన కమ్మలదిన్నె లక్ష్మన్న(42) అనే వలస కూలీ బుధవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాల్లో పనులు లేక బతుకు తెరువు కోసం లక్ష్మన్న భార్య భీమక్క , 9వ తరగతి చదువుతన్న కుమార్తె గోవిందమ్మతో కలిసి రాయచూరు జిల్లా హోస్పేట్ మండలం జిగుకల్లు గ్రామంలో పత్తి వేరుట కోసం నెల రోజుల క్రితం వలస వెళ్లారు. ఉదయం పొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై కుప్పకూలి కిందకు పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడ ప్రైవేట్ వైద్య శాలకు తరలించే లోగా మృతి చెందాడు. ఆయనకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదు. వలస వెళ్లి కుటుంబాన్ని పోిషించుకునేవాడు. ఒక కుమారుడికి వివాహం చేయగా, రెండో కుమారుడు రామాంజినేయులు గ్రామంలో 10వ తరగతి చదువుతున్నా డు. ఆకస్మికంగా కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.


