● పెట్రోల్ బంకుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
మండల పరిధిలోని నర్సాపురం వద్ద బుధవారం ఓ ట్రాక్టర్ పెట్రోల్ బంకు మీదకు దూసుకెళ్లింది.అయితే ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. నర్సాపురం నుంచి అహోబిలం వెళ్లే దారిలో ఓ పెట్రోల్ బంకు ఉంది. డ్రైవర్ తన ట్రాక్టరుకు డీజల్ పట్టించుకునేందుకై వెళ్లాడు. డీజల్ పట్టించాక ట్రాక్టరును ముందుకు కదిలించే సమయంలో హఠాత్తుగా డ్రైవర్‌కు బీపీ తగ్గడంతో ట్రాక్టర్ నడపడంలో పట్టు తప్పింది. దీంతో ఒక్క సారిగా ఆ ట్రాక్టరు ముందుకు దూసుకెళ్లి డీజల్ పట్టే బంకును ఢీ కొట్టింది. పెట్రోల్ బంకు సిబ్బంది భయభ్రాంతులకు గురై హహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. – రుద్రవరం


