చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
దేవనకొండ: చదువుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని మైమూన్ మొదట విడతలోనే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీటు సాధించింది. కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆకె రవికృష్ణ ఈ విషయం తెలుసుకొని ఆ విద్యార్థినిని బుధవారం విజయవాడలోని తన కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నాలుగేళ్లు చదివేందుకు అయ్యే ఖర్చును బొమ్మిడాలా ట్రస్ట్ సమకూర్చుతుందని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.


