బీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో 94 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు బుధవారం 3,718 మందికి గాను 3,499 మంది (94శాతం) విద్యార్థు లు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. బీపీఈడీ పరీక్షలకు 159 మందికి 145 మంది, ఎంపీఈడీ పరీక్షలకు 102 మందికి 94 మంది హాజరైనట్లు తెలిపారు. కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు
ఆదోని అర్బన్: పట్టణంలో రెండు రోజుల క్రితం కంచిగారి వీధిలో బిల్డింగ్‌ను బతికున్న వ్యక్తిని మరణించినట్లుగా సృష్టించి చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్‌ను బుధవారం రద్దు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై ‘బతికున్న వ్యక్తి మరణించినట్లుగా సృష్టించి’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఆదోని సబ్‌రిజిస్ట్రార్ సునంద అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున వారిని పిలిపించి వారితో రుద్ద చేయించారు. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఆదోనిలో ఇప్పటివరకు మూడు జరిగాయి. వెలుగులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం తప్ప సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులపై చర్యలు ఏవీ అని ఆదోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వేలు కొరికిన ఆటోడ్రైవర్
డోన్ టౌన్: తన ఇంటి వద్ద ఆటోను పార్క్ చెయ్యవద్దని హుస్సేన్ అనడంతో కోపంతో ఆటో డ్రైవర్ వేలు కొరికాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డోన్ పాతపేటకు చెందిన హుస్సేన్ ఇంటి వద్ద అదే కాలనీకి చెందిన షేక్షావలి ప్రతి రోజు రాత్రి ఆటో పార్కింగ్ చేస్తున్నారు. ఆటోను పార్కు చెయ్యవద్దు అని మంగళవారం రాత్రి ఆటకాయించడంతో ఆటో డ్రైవర్ షేక్షావలి ఆగ్రహంతో గొడవకు దిగాడు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ తండ్రి, భార్య తోడై హుస్సేన్‌పై దాడి చేశారు. అదే సమయంలో హుస్సేన్ చేతి వేలు షేక్షావలి కొరికాడు. గమనించిన కాలనీ వాసులు వారించి బాధితున్ని చికిత్సల నిమ్మిత్తం వైద్యశాలకు తరలించారు.


