
ఐక్యంగా నంద్యాల అధ్యక్ష ఖండం అభివృద్ధి చేస్తాం
● బిషప్ సంతోష్ ప్రసన్నరావు
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల డయాసిస్ పరిధిలోని అన్ని సంఘాల ఐక్యమత్యంతో నంద్యాల అధ్యక్ష ఖండాన్ని అభివృద్ధి చేస్తానని ఆ ఖండం పీఠాధిపతులు, రైట్‌రెవరెండ్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు అన్నారు. ఆదివారం హోలీక్రాస్ కెథడ్రల్ ఆలయ సమీపంలో నుంచి జ్ఞానాపురంలో ఉన్న పరిశుద్ధ మత్తయి ఆలయానికి ఊరేగింపుగా బిషప్‌ను తీసుకొచ్చారు. పరిశుద్ధ మత్తయి ఆలయం డీనరీ చైర్మన్ నందం ఐజక్ గురువులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన నిర్ధారణ కార్యక్రమంలో బిషప్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శాంతి, సమాధానం, ప్రేమాగుణంతో అందరి సహకారంతో నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బిషప్‌గా బాధ్యతలు చేపట్టి నెలన్నర రోజులకే ముద్దనూరు పాస్టరేట్‌లో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం బిషప్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాస్టర్ రవీంద్ర గురువులు, పరిశుద్ధ మత్తయి ఆలయం కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.