
కనకదాసు విగ్రహం ధ్వంసం
ఆలూరు రూరల్: మండలంలోని మనేకుర్తి గ్రామంలోని హైవే–167 పక్కన ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. కనకదాసు వి గ్రహం ఎడమ చేయి విరగొట్టారు. విగ్రహ ధ్వంసా న్ని నియోజకవర్గ కురువ సామాజిక వర్గం నాయకులు ఖండించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఆలూరు ఎస్‌ఐ మహబూబ్ బాషాకు ఫిర్యాదు చేశారు. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ మాదారి,మాదాసి కురువ సంఘం నాయకులు స్థానిక అంబేడ్కర్ కూడలిలో గంట పాటు ధర్నా చేపట్టారు.కార్యక్రమంలో దేవేంద్రప్ప,అయ్యాళప్ప, మల్లికార్జున, మహానంది, లింగ,రాజు,నాగేంద్ర,మంగన్న, చంద్ర,ఉల్తేప్ప కురువ కులస్తులు పాల్గొన్నారు.
దాడిని ఖండించిన
ఎమ్మెల్యే విరూపాక్షి
కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఖండించారు. కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

కనకదాసు విగ్రహం ధ్వంసం