ప్రైవేటులో ఫీజుల బాదుడు! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటులో ఫీజుల బాదుడు!

Sep 12 2025 9:45 AM | Updated on Sep 12 2025 9:45 AM

ప్రైవ

ప్రైవేటులో ఫీజుల బాదుడు!

వైరల్‌ ఫీవర్లే ఎక్కువగా వస్తున్నాయి వాతావరణ మార్పులతో జ్వరాలు

పెద్దాసుపత్రిలో గత తొమ్మిది రోజులుగా

నమోదైన ఓపీ

జ్వరం వచ్చిన వారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే డెంగీ, మలేరియా ఉంటుందేమోనని పదిరకాలకు పైగా రక్తపరీక్షలు చేయిస్తున్నారు. ఒక్కో ఆసుపత్రిని బట్టి పరీక్షలు, చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఉంటోంది. అది మలేరియా, డెంగీ లాంటి లక్షణాలుంటే మాత్రం ఆసుపత్రిలో నాలుగైదు రోజులు చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.30వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ఆర్థికస్థోమత ఉన్న వారు వైద్యులు చెప్పిన మేరకు ఖర్చు చేస్తుండగా మరికొందరు ఇప్పుడే వస్తామంటూ అక్కడి నుంచి జారుకుని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు.

ఆసుపత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ ఓపీకి ప్రతిరోజూ 300 నుంచి 400 మంది రోగులు వస్తున్నారు. అందులో సగానికి పైగా జ్వరపీడితులే ఉంటున్నారు. ఎక్కువశాతం జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారే ఉన్నారు. సీజనల్‌గా వచ్చే వైరల్‌ ఫీవర్లే ఉంటున్నాయి. జ్వరతీవ్రత 102 నుంచి 104 ఫారిన్‌హీట్‌ వరకు ఉంటోంది. అవసరమైన వారికి వైద్యనిర్ధారణ పరీక్షలు చేయించి మందులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇందులో రోజూ 10 నుంచి 15 మంది అడ్మిషన్‌ చేస్తున్నాం. కొందరికి మలేరియా లక్షణాలు కనిపిస్తుండటంతో అందుకు సంబంధించిన వైద్యం అందిస్తున్నాం.

–డాక్టర్‌ కె.సోమప్ప, అసోసియేట్‌ ప్రొఫెసర్‌,

జనరల్‌ మెడిసిన్‌, జీజీహెచ్‌, కర్నూలు

వర్షాలు బాగా కురిసి ఆగిపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరల్‌ ఫీవర్ల కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదు రోజులుగా జ్వరం ఉండి ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ డెంగీ, మలేరియా కిట్స్‌ ద్వారా పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్‌ వస్తే అవసరమైన చికిత్స అందిస్తున్నాం. వీరిని ఫాలో అప్‌ చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి చెబుతున్నాం. తగ్గకపోతే కర్నూలుకు రెఫర్‌ చేయాలని ఆదేశిస్తున్నాం. వర్షాల కారణంగా నీరు నిలిచిన చోట దోమలు వృద్ధి చెందకుండా క్రిమిసంహారక మందు పిచికారీ చేయిస్తున్నాం. డెంగీ, మలేరియా ప్రబలిన ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

–నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు

ఆస్పరి మండలం బిల్లేకల్‌ ప్రాంతానికి చెందిన ఈరన్నకు వారం రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లాడు. వైద్యులు డెంగీ జ్వరంగా అనుమానించి చికిత్స అందించారు. వారం రోజులు చికిత్స అందించగా అతనికి బాగు కావడంతో డిశ్చార్జ్‌ చేశారు.

కర్నూలు నగరంలోని రిటైర్డ్‌ ఉద్యోగి వెంకటేశ్వర్లు జలుబు, దగ్గు, జ్వరం రావడంతో సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోగా రూ.2వేలకు పైగా ఖర్చయ్యింది. ఇలాగే తన కుమారునికి కూడా జ్వరం రావడంతో మెడికల్‌షాపునకు వెళ్లి మందులు కొని వాడి తగ్గించుకున్నాడు.

కర్నూలులోని సీతారామనగర్‌కు చెందిన నరేంద్రకుమార్‌కు తీవ్ర జ్వరం రావడంతో ఓ ప్రైవేటు వైద్యున్ని సంప్రదించాడు. అప్పటికప్పుడు మందులు రాసి పంపించారు. నాలుగురోజులైనా జ్వరం తగ్గకపోవడంతో మళ్లీ డాక్టర్‌ వద్దకు వెళ్లగా రక్తపరీక్షలు చేయించి వైరల్‌ ఫీవర్‌ అని తేల్చారు. వారం రోజులు మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని సూచించి పంపించారు.

కర్నూలు(హాస్పిటల్‌): వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్లీ పడుతుండటంతో జ్వరపీడితుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ముందుగా మెడికల్‌షాపులకు వెళ్లి లక్షణాలు చెప్పి రెండు, మూడు రోజులు మందులు వాడుతున్నారు. అప్పటికీ తగ్గకపోతేనే వైద్యుల వద్దకు వెళుతున్నారు. అయినా కూడా జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, బోదనాసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. గత పదిరోజులుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ రోగుల సంఖ్య 3,200లు దాటుతోంది. సాధారణ రోజుల్లో ఈ సంఖ్య 2వేల నుంచి 2,500 మధ్య ఉండేది. అందులోనూ జనరల్‌ మెడిసిన్‌, చిన్నపిల్లల విభాగాల్లో రెట్టింపు సంఖ్యలో ఓపీ నమోదవుతోంది. వీటిలో సగం మంది జ్వరపీడితులేనని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ ఎక్కువగా వైరల్‌ ఫీవర్లే ఉంటున్నాయి. ఈ జ్వరం ఇంట్లో ఒకరికి వస్తే క్రమంగా కుటుంబసభ్యులందరినీ వేధిస్తోంది. ముందుగా జలుబు, దగ్గు వచ్చి అనంతరం ఒళ్లునొప్పులు ప్రారంభమై తీవ్ర జ్వరం వేధిస్తోంది. మరోవైపు జిల్లాలో ఇప్పటి వరకు 2,198 మందికి డెంగీ లక్షణాలు ఉండగా అందులో 196 మందికి పాజిటివ్‌గా నమోదైంది.

‘ఓపి’క నశించి..

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు చేయడానికి భయపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే అక్కడ అరకొర వైద్యం అందుతోంది. పీహెచ్‌సీల్లో చాలా చోట్ల వైద్యులు ఉండకపోవడంతో అక్కడున్న నర్సులు, ఫార్మాసిస్టులే మందులు ఇస్తున్నారు. దీంతో సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, కర్నూలు పెద్దాసుపత్రికి రోగులు వస్తున్నారు. సీమెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల్లో జ్వరలక్షణాలను బట్టి మందులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో బతుకుజీవుడా అంటూ కర్నూలుకు జ్వరపీడితులు వస్తున్నారు. కర్నూలుకు రావడానికి సైతం ప్రయాణ ఇబ్బందులు తప్పడం లేదు. జ్వరపీడితులు సైతం కూర్చోవడానికి ఆర్టీసీ బస్సులు ఉండటం లేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఓపీ కోసం అరగంట, చికిత్స కోసం గంట, వైద్యపరీక్షలకు మరో గంట వేచి ఉండాల్సి వస్తోంది. మొత్తానికి ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు, నాలుగు గంటలు నిలబడితే గానీ పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంది. జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌ వంటి విభాగాలు రోగుల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగిస్తున్నాయి.

తేదీ(వారం) ఓపీ సంఖ్య జనరల్‌ మెడిసిన్‌ పీడియాట్రిక్స్‌

1(సోమ) 3,339 425 295

2(మంగళ) 3,131 526 265

3(బుధ) 3,020 437 292

4(గురు) 2,167 311 210

5(శుక్ర) 1,955 253 186

6(శని) 2,795 395 306

7(ఆది) 831 0 0

8(సోమ) 3,420 412 308

9(మంగళ) 3,217 444 292

తీవ్రమైన నొప్పులు... శరీరమంతా నిస్సత్తువ.. కళ్ల వెంట వస్తున్న నీళ్లు... వీడని జలుబు, దగ్గు.. ఈ లక్షణాలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం వస్తోంది. వైరల్‌ ఫీవర్‌ కావడంతో ఒకరి నుంచి మరొకరికి వస్తూ ప్రతి ఇంట్లో బాధితులు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇదిలా ఉండగా జిల్లాలో డెంగీ కేసులు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి.

జిల్లాలో ప్రతి ముగ్గురిలో

ఒకరికి జ్వరం

ఏ ఇంట్లో చూసినా బాధితులే!

కిక్కిరిసిన ప్రభుత్వ,

ప్రైవేటు ఆసుపత్రులు

పెద్దాసుపత్రిలో పది రోజులుగా

పెరిగిన ఓపీ

మరోవైపు డెంగీ కేసుల పెరుగుదల

ప్రైవేటులో ఫీజుల బాదుడు! 
1
1/4

ప్రైవేటులో ఫీజుల బాదుడు!

ప్రైవేటులో ఫీజుల బాదుడు! 
2
2/4

ప్రైవేటులో ఫీజుల బాదుడు!

ప్రైవేటులో ఫీజుల బాదుడు! 
3
3/4

ప్రైవేటులో ఫీజుల బాదుడు!

ప్రైవేటులో ఫీజుల బాదుడు! 
4
4/4

ప్రైవేటులో ఫీజుల బాదుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement