
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ ఏ.సిరి
పోస్టింగ్ దక్కని పి.రంజిత్‌బాషా
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా డాక్టర్ అట్టాడ సిరి నియమితులయ్యారు. ఆమె సెంకడరీ హెల్త్ డైరక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై కర్నూలుకు వస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న పి.రంజిత్‌బాషాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జేఏడీలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 బ్యాచ్‌కు చెందిన ఎ.సిరి స్వామిత్వ ప్రత్యేక కమిషనర్‌గా, ఉమెన్ డెవలప్‌మెంట్‌అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరక్టర్‌గా, అనంతపురం జాయింట్ కలెక్టర్(వార్డు, గ్రామ సచివాలయాలు)గా, ఆప్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీగా పనిచేశారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఈమె రెండో మహిళా కలెక్టర్. గతంలో డాక్టర్ సృజన మొదటి కలెక్టర్‌గా జిల్లాలో సేవలందించారు. వీరిద్దరూ డాక్టర్లే కావడం విశేషం. ఎ.సిరి ఎక్కడ పనిచేసినా తనదైన మార్కును కనపరుస్తారనే ప్రచారం ఉంది.
నూతన కలెక్టర్‌కు సవాళ్ల స్వాగతం
● ఉల్లి రైతులు మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం క్వింటా ఉల్లి మద్దతు ధర రూ.1200 ప్రకటించినా రైతులకు ఉపయోగం లేకుండా పోతోంది. ఈ క్రమంలో రైతులను ఏ విధంగా ఆదుకుంటారో వేచి చూడాలి.
● వేదవతి ప్రాజెక్టు భూసేకరణ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ విస్తరణ పనులు కూడా కూటమి ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు.
● స్వర్ణాంధ్ర లక్ష్యాలను అధికారులు దాదాపు రూ.10 వేల కోట్లతో రూపొందించారు. వాటికి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి నిధులు సమకూర్చాల్సి ఉంది.
● జిల్లాలో భూ సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి సోమవారం పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు.
అధికార కూటమి నాయకులతో
అంటకాగినట్లు ఆరోపణ
సొంత జిల్లాలో కనిపించని
తనదైన మార్కు