
వైద్య కళాశాలలపై బాబు కుట్ర
కర్నూలు (టౌన్): దేశ చరిత్రలో ఒకేసారి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందనే అక్కసుతోనే వాటిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల అప్పు, రాజధాని నిర్మాణానికి మరో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందే ఉచిత వైద్యం కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయ్య లేరా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ‘ఉన్న’ వర్గాలకే ఊడిగం చేస్తుందోని విమర్శించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. జగనన్న హయాంలో నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ. 8 వేల కోట్ల ఖర్చులో రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరు ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయన్నారు. మిగతా వైద్య కళాశాలల నిర్మాణ పనులు వివిధ దశఽల్లో ఉన్నాయన్నారు. మంత్రి నారే లోకేష్ అనుచరుల కోసమే ఈ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు.
ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
వైద్య కళాశాలల స్థలాలు రూ. వందల కోట్ల విలువైనవని, అయితే ఎకరాకు రూ.100 ప్రకారం 66 సంవత్సరాలు లీజుకు ఇచ్చారని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వైద్యం పేరుతో ప్రజల నుంచి రూ. లక్షలు వసూలు చేసేందుకే కదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే టీడీపీ నేతలు ఇసుక, మద్యం, మైనింగ్, లిక్కర్ సిండికేట్‌తో రూ. వందల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి మేనేజ్‌మెంట్ కోటాతో ఒక్కొక్క వైద్య విద్యార్థి నుంచి రూ. లక్షలు వసూలు చేసే అవకాశం ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. కర్నూలు జిల్లాలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ఆందోళనలు చేస్తామమన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామని ఎస్వీ స్పష్టం చేశారు.
రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే వైద్య
కళాశాలలు అందుబాటులోకి వస్తాయి
మంత్రి నారా లోకేష్
అనుచరుల కోసమే ప్రైవేటీకరణ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి