
సారా తయారీ మానుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి
● నేర సమీక్షా సమావేశంలో
ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్
కర్నూలు: సారా తయారీ, రవాణా విక్రయాలు మానుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో ఆమె నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2పై ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా సమీక్షించారు. ఇప్పటికే సారా రహిత గ్రామాలుగా ప్రకటించిన గ్రామాల్లో తిరిగి సారా తయారీ కాకుండా నిఘా ఉంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నోటిఫికేషన్ ఇచ్చిన రెండో విడత బార్లకు దరఖాస్తులు వచ్చేలా చూడండి...
నూతన మద్యం బార్ పాలసీలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొదటి రౌండ్‌లో అనుమతి పొందిన 37 బార్లకు సంబంధించిన వారి చేత రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ కట్టించి బార్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి విడతలో దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన 9 బార్లకు రీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 14వ తేదీ లోపు వాటికి అప్లికేషన్లు వచ్చే విధంగా గట్టిగా కృషి చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి రాకుండా నిరంతరం తనిఖీలు, దాడులు కొనసాగించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులు (ఈఎస్) మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడుతో పాటు అన్ని స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.