
ఉల్లి కొనుగోళ్లు అంతంతే!
మార్కెట్‌కు 14,325 క్వింటాళ్లు
● వ్యాపారులు కొనింది 6,749 క్వింటాళ్లు మాత్రమే
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి అమ్మకాల కోసం రైతులు వ్యాపారులు లేదా మార్క్‌ఫెడ్ అధికారుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం మార్కెట్ యార్డుకు 14,325 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. రెండు విడతలుగా వ్యాపారులతో ఈ–నామ్‌లో టెండ ర్లు వేయించినప్పటికీ 6,749 క్వింటాళ్లు మా త్రమే కొనుగోలు చేశారు. క్వింటాకు కనిష్టంగా రూ200, గరిష్టంగా రూ.1139 ధర పలికి ంది. రూ.1000 పైన ధర కేవలం నాలుగైదు లాట్లకు మాత్రమే లభించగా.. మిగిలిన లాట్లకు రూ.600–రూ.700 మాత్రమే ధర లభించింది. రైతులు తెచ్చిన ఉల్లిలో 7,576 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌లోనే ఉండిపోవడం గమనార్హం. ఈ సరుకు మార్క్‌ఫెడ్ కొంటుందా లేదా అనే విషయమై సాయంత్రం 7 గంటల వరకు స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా, జేసీ నవ్య, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ సాయంత్రం మార్కె ట్ యార్డుకు చేరుకున్నారు. ఉల్లిగడ్డల నాణ్యతను పరిశీలించారు. ఎట్టకేలకు మిగిలిపోయిన ఉల్లిగడ్డలను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, డీడీ లావణ్య, ఏడీఎం నారాయణ మూర్తి, సెక్రటరీ జయలక్ష్మి తదితరులు ఉ న్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో ఉల్లిగడ్డలు రీసైక్లింగ్ జరుగుతున్నాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిశీలనకు జిల్లా యంత్రాంగం ఐదుగురు ఉద్యాన అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పా టు చేసింది. ఇకపోతే బుధవారం మార్కెట్‌లో ఉల్లిగడ్డలను అమ్మకానికి పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయి. అయితే లోపల ఖాళీ లేకపోవడంతో వచ్చిన వాహనాలన్నిటినీ బయటనే నిలిపేయంతో ట్రాఫిక్ స్తంభించింది.