
ప్రయాణికులకు విజ్ఞప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన ప్రయాణికులకు శాపంగా మారింది. సీఎం పర్యటనకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు కేటాయించారు. అన్ని రకాల సర్వీసులు కలుపుకొని మొత్తం 410 ఉండగా ఇందులో 280కు పైగా బస్సులు సీఎం టూర్‌కు వేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే వివిధ రూట్లకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నంద్యాల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, కర్నూలు, తాడిపత్రి, తదితర ప్రధాన రూట్లకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సులు లేకపోవడంతో మహిళలు , చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు గంటల తరబడి వేచి ఉన్నారు. చివరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే సీఎం పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి వరకు వివిధ రూట్లలో బస్సు సర్వీసులు రద్దు చేశామని.. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఏకంగా అధికారులు కోవెలకుంట్ల బస్టాండ్‌లో నోటీస్‌బోర్డు అతికించడం గమనార్హం.
– సాక్షి నెట్ వర్క్

ప్రయాణికులకు విజ్ఞప్తి

ప్రయాణికులకు విజ్ఞప్తి

ప్రయాణికులకు విజ్ఞప్తి

ప్రయాణికులకు విజ్ఞప్తి