
వివాహిత అదృశ్యం
సంజామల: మండల పరిఽ దిలోని కానాల గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైంది. సంజామ ల ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు..కానాల గ్రామానికి చెందిన సోము భాస్కర్‌రెడ్డి కుమార్తె సోము శశిరేఖకు నంద్యాలకు చెందిన శ్రీహరి రెడ్డితో 2023 సంవత్సరంలో వివాహమైంది. భార్యాభర్తల వ్యక్తిగత గొడవల కారణంగా సోము శశిరేఖ పెళ్లి అయిన కొన్ని నెలలకే తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత వారి నుంచి కూడా బయటకు వెళ్లిపోయింది. అయితే, తన భార్య కనిపించడం లేదని శ్రీహరి రెడ్డి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆలయ హుండీలు చోరీ
గడివేముల: మండల కేంద్రమైన గడివేములలోని కొత్త మూలపెద్దమ్మ ఆలయంతో పాటు బూ జునూరు గ్రామంలోని వెంకటేశ్వరస్వామి హుండీలను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆలయాలకు ఉన్న తాళాలలను పగలగొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హుండీల్లోని సొమ్మంతా తీసుకుని ఊరి బయట వాటిని పడేసి వెళ్లారు. మంగళవారం ఆలయ నిర్వాహుకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ చోరీపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. కాగా హుండీల్లో దాదాపు రూ.2 లక్షల దాకా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
అంగన్‌వాడీ టీచర్‌పై
సీడీపీఓ వేధింపులు
ఆలూరు రూరల్: ఐసీడీఎస్ సీడీపీఓ వేధింపులు తాళలేక ఓ అంగన్‌వాడీ టీచర్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. బధితురాలు తెలిపిన వివరాల మేరకు . ఆలూరు మండలం కురువళ్లి గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో భువనేశ్వరి కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఈ నెల 6వ తేదీన ఆలూరు ఐసీడీఎస్ సీడీపీఓ నరసమ్మ కురువళ్లి అంగన్‌వాడీ కేంద్రానికి తనిఖీకి వెళ్లి స్టాక్ రూం పరిశీలించారు. సరుకుల వివరాలు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్త చేస్తూ రూ. 4 వేలు డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని ఫోన్ పే చేయమని సూచించగా అంగన్‌వాడీ కార్యకర్త పంపించలేదు. దీంతో సీడీపీఓ ఆమెను వేధించడం మొదలుపెట్టింది. మంగళవారం ఆలూరులోని ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అంగన్‌వాడీల కార్యకర్తల సమావేశంలో భూమనేశ్వరిని టార్గెట్ చేసింది. అందరి ముందు సరుకులను అమ్ముకుంటున్నావని ఆరోపిస్తూ దురుసుగా మాట్లాడారు. డబ్బు ఇవ్వలేదని తనపై నింద వేయడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు బాధితురాలు తెలిపారు. ఒక పక్క పని ఒత్తడి.. మరో పక్క అధికారుల వేధింపులు తాళలేకపోతున్నామని భువనేశ్వరి వాపోయారు.

వివాహిత అదృశ్యం

వివాహిత అదృశ్యం