సెట్‌ల కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

సెట్‌ల కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల

Sep 10 2025 3:39 AM | Updated on Sep 10 2025 3:39 AM

సెట్‌ల కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల

సెట్‌ల కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల

కర్నూలు కల్చరల్‌: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పలు సెట్‌లకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌, ఏపీ పీజీసెట్‌లలో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనుంది

● లాసెట్‌/పీజీ ఎల్‌సెట్‌లో భాగంగా ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు, ఐదేళ్లు), ఎల్‌ఎల్‌ఎం (రెండేళ్లు) కోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనుంది. ఈనెల 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, 9 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 12 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 15న వెబ్‌ ఆప్షన్ల మార్పులకు అవకాశ ం, 17న సీట్ల కేటాయింపు, 18,19 తేదీల్లో సంబంధిత కళాశాలల్లో విద్యార్థులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంది.

● రెండేళ్లు బీఈడీ, బీఈడీ స్పెషల్‌ కోర్సులకు ఎడ్‌సెట్‌ ద్వారా సీట్లు కేటాయింపు చేయనున్నారు. ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైణ్‌ రిజిస్ట్రేషన్‌, 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 13 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 16న వెబ్‌ ఆప్షన్ల మార్పు, 18న సీట్ల కేటాయింపు, 19, 20 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంది.

● రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో పీఈసెట్‌ ద్వారా సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 10 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, 11 నుంచి 14 వరకు ధ్రు వ పత్రాల పరిశీలన, 14 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 17న వెబ్‌ ఆప్షన్ల మార్పు, 19న సీట్ల కేటాయింపు, 22, 23 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి.

● రాష్ట్రలోని యూనివర్సిటీల్లో రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీసెట్‌ ద్వారా సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, 9 నుంచి 16 వరకు ధ్రువ పత్రాల పరిశీలన, 12 నుంచి 17 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 18న వెబ్‌ ఆప్షన్ల మార్పు, 20న సీట్ల కేటాయింపు, 22, 23, 24 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని షెడ్యూల్‌లో ప్రకటించారు.

భార్యను హత్య చేసిన భర్త

నంద్యాల: కుటుంబ కలహాలతో భార్యను భర్తే గొంతు కోసి చంపాడు. ఈ దారుణ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. నంద్యాల టూటౌన్‌ సీఐ అస్రార్‌బాషా తెలిపిన మేరకు వివరాలు.. సాయినాథ్‌శర్మ, శిరీష దంపతులు పట్టణంలోని ఎన్‌జీఓస్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కూతురు శ్రీహిత స్థానికంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే, భార్య శిరీష (45) బయట అప్పులు చేయడం..ఈ కారణంతో రుణదాతలు తరచుగా ఇంటికి వస్తున్నారు. దీంతో ఆగ్రహించిన సాయినాథ్‌శర్మ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశారు. ఈమేరకు కుమార్తె శ్రీహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement