
● కష్టమంతా జీవాలకు మేత!
గోనెగండ్ల: ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లిపంటకు ధర లేకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు చేతికి వచ్చిన పంటను పొలాల్లోనే వదులుతున్నారు. మండల కేంద్రం గోనెగండ్లకు చెందిన చాకలి బ్రహ్మయ్య అనే రైతు ఎన్నో ఆశలతో 2.50 ఎకరాల్లో ఉల్లి సాగుచేశాడు. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట చేతికి వచ్చేసరికి క్వింటం ధర రూ.500 నుంచి రూ.600 పలుకుతుంది. ఈ ధరకు కూలీల ఖర్చు కూడా రాదని భావించి పంట కోయకుండా మంగళవారం గొర్రెలకు మేతగా వదిలాడు. తమ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు.