
అమ్మానాన్నలు దూరమై..
ఆస్పరి: తండ్రి హత్యకు గుర య్యాడు..తల్లి జైలుకెళ్లింది. అభం శుభం తెలియని పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇంటికి వచ్చిపోయే వారిని ఆ పిల్ల లు తదేకంగా చూస్తూ ఉన్నారు. మండలంలోని తొగలుగల్లు గ్రామంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక దృశ్యం అందరినీ కలచివేస్తోంది. ఈనెల 3వ తేదీన తొగలుగల్లు గ్రామానికి చెందిన అహోబిలం (33) అనే వ్యక్తిని తోడుగా ఉండాల్సిన భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, మృతుడికి 7ఏళ్ల కుమారుడు భరత్ గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. 5 ఏళ్ల వర్షిణి అనే కుమార్తె అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతుంది. తండ్రిని హత్య చేసిన కేసులో తల్లి గంగావతి జైలుకెళ్లింది. కన్నతల్లిదండ్రులు దూరమై దిక్కులు చూస్తున్న పిల్లల భవిష్యతును తలుచుకొని నాయనమ్మ హనుమంతమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
ఇసుక దోపిడీని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
ఆదోని అర్బన్: తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలో ఇసుక తోలే టిప్పర్ల ఓనర్లు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీని ఆపాలని ఇదివరకే సబ్‌కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశానన్నారు.