
ముస్లింలకు బాబు మోసం
కర్నూలు(సెంట్రల్):ముస్లింలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు టీఎండీ ఫిరోజ్ ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇమామ్‌లు, మౌజమ్‌లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇచ్చేవారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చా క పట్టించుకోవడం లేదన్నారు. 11 నెలల నుంచి గౌరవ వేతనాలు అందక ఇమామ్‌లు, మౌజమ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.