
శిథిల‘బడి’
కోడుమూరు మండలంలోని అమడగుంట్ల హైస్కూల్లో తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ పాఠశాలలో 325 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉండగా వీరికి 16 మంది ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. పాఠశాలలోని ఐదు గదుల్లోనే తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసన వర్షాలకు భవనం పై కప్పు నుంచి వర్షపు నీరు కారింది. గత నెల 17న హెచ్‌ఎం గదితో పాటు మరో రెండు తరగతి గదుల్లో భారీగా పెచ్చులూడిపడ్డాయి. ఆరోజు సెలవు వడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తరగతి గదుల్లో భారీగా పెచ్చులూడిపడుతుండడంతో ప్రమాదాన్ని గ్రహించిన ఉపాధ్యాయులు ముందస్తుగా గదులను ఖాళీ చేయించి బాగున్న తరగతి గదుల్లోకి విద్యార్థులను తరలించి అక్కడ విద్యాబోధన చేస్తున్నారు. హైస్కూల్లోని తరగతులు పూర్తిగా శిథిలావస్థకు చేరిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు అనంతయ్య తెలిపారు.
– కోడుమూరు రూరల్

శిథిల‘బడి’

శిథిల‘బడి’

శిథిల‘బడి’

శిథిల‘బడి’