
కాపర్ వైర్ల దొంగలు అరెస్ట్
సంజామల: రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వేలైన్‌కు సంబంధించిన విద్యుత్ రాగి (కాపర్) వైర్లు అపహరించిన దొంగలను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రమణయ్య సోమవారం తెలిపిన వివరాల మేరకు..రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకు సంజామల నుంచి కొలిమిగుండ్ల మండలం వరకు నూతన రైల్వేట్రాక్ పనులు జరుగుతున్నాయి. రెడ్డిపల్లె గ్రామ సమీపంలో గత నెల 23వ తేదీన రైల్వేలైన్‌కు చెందిన దాదాపు రూ.5.50 లక్షల విలువైన రాగి విద్యుత్ వైర్లు దొంగలించారు. ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ మేనేజర్ కృష్టమూర్తి ఫిర్యాదు మేరకు సంజామల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ రమణయ్య సోమవారం ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. రాగి విద్యుత్ వైర్లు దొంగ లించినట్లు ఒప్పుకున్నారు. నిందితుల దగ్గర నుంచి రూ.4.40 లక్షల విలువైన 210 కేజీల వైర్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు. సమావేశంలో హెడ్‌కానిస్టేబుల్ రాముడు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.