కూటమి నేతల బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల బరితెగింపు

Sep 9 2025 8:43 AM | Updated on Sep 9 2025 8:43 AM

కూటమి నేతల బరితెగింపు

కూటమి నేతల బరితెగింపు

డోన్‌: ‘మా ఊర్లో మీరు బతకడానికి వీలులేదు.. మీరు వ్యాపారాలు ప్రారంభిస్తే మా వ్యాపారాలు దెబ్బతింటాయి.. అనే జాడ్యం డోన్‌కు వ్యాపించింది. ఇందులో భాగంగా అధికార పార్టీకి చెందిన వస్త్ర దుకాణదారులు స్థానిక ప్రజాప్రతినిధి సహాయంతో కేరళ వ్యాపారికి ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఇవ్వకుండా అడ్డుకున్న ఘటన వెలుగు చూసింది. గార్మెంట్స్‌ వ్యాపారులు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ సిండికేట్‌గా ఏర్పడి ఇతరులు ఎవరూ ఈ రంగంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఫుట్‌పాత్‌పై రెడిమేడ్‌ దుస్తులను విక్రయించడాన్ని కూడా అడ్డుకొని దాడులు చేయించిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కేరళ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక బుగ్గన శేషారెడ్డి మార్గ్‌లో ఓ దుకాణం అద్దెకు తీసుకొని వస్త్ర దుకాణం ఏర్పాటు చేయాలనుకున్నాడు. సుమారు 20 లక్షల దుస్తులతో పాటు, రూ.5 లక్షలు వెచ్చించి దుకాణాన్ని ఫర్నిచర్‌తో సరికొత్తగా తీర్చిదిద్డాడు. అయితే వీరి రాకతో గార్మెంట్స్‌ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన అధికార పార్టీకి చెందిన వ్యాపారులు ఇటీవల ఆ షాపుపై దాడిచేసి యజమానిని బెదిరించారు. అంతేకాకుండా పోలీసు, మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి షాపు తెరవకుండా అడ్డుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి చెప్పారంటూ మున్సిపల్‌ అధికారులు ఆ షాపునకు ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడానికి నిరాకరించారు. ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఉంటే షాపు తెరుచుకో.. లేదంటే లేదని పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు వంత పాడారు. దీంతో కేరళ వ్యాపారి దిక్కుతోచని స్థితిలో షాపును మరో ఊరికి మార్చేందుకు నిర్ణయించుకున్నారు. తెచ్చిన సరుకును తరలించేందుకు మూట గట్టారు. స్థానిక ఓ ప్రజా ప్రతినిధి చెబితేనే ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఇవ్వలేదని మున్సిపల్‌ కమిషనర్‌ బాహాటంగా చెబుతుండటం గమనార్హం.

కేరళ వ్యాపారి వస్త్ర దుకాణం ఏర్పాటు

ఎమ్మెల్యేను ఆశ్రయించి అడ్డుకున్న స్థానిక వ్యాపారులు

ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఇవ్వకుండా అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి

దుకాణం ప్రారంభించకుండానే మూతేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement