
మనస్పర్థ్ధలతోనే స్వర్ణకారుడి హత్య
వీడిన స్వర్ణకారుడి హత్య కేసు మిస్టరీ నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
కర్నూలు: బంగారు నగల తయారీదారుడు షేక్ ఇజహర్ అహ్మద్ (45) హత్య కేసు మిస్టరీ వీడింది. రెండు కుటుంబాల మధ్య గొడవలు, మనస్పర్థలే హత్యకు కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు ఒకటో పట్టణ సీఐ పార్థసారధి, పీసీఆర్ సీఐ శివశంకర్, ఎస్‌ఐ తిమ్మారెడ్డితో కలసి సోమవా రం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాలు వెల్లడించారు.
కేసు ఛేదన ఇలా..
కర్నూలు కొత్తపేటలో షేక్ ఇజహర్ అహ్మద్ నివాసముంటున్నాడు. కొండారెడ్డిబురుజు వద్ద ఉన్న స్వర్ణలోక్ కాంప్లెక్స్‌లోని 29వ నంబర్ దుకాణంలో నగలు తయారు చేసేవాడు. రాధాకృష్ణ థియేటర్ సమీపంలోని మడ్గియాన్ కీ మసీదుకు తండ్రి షేక్ గౌస్ నిసార్ అహ్మద్‌తో కలసి ఈనెల 1వ తేదీన నమాజు ముగించుకుని బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యా రు. ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయించగా అదే రోజు రాత్రి 8 గంటలకు కోలుకోలే క మృతిచెందాడు. తండ్రి షేక్ గౌస్ నిసార్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు నగర శివారులోని జొహరాపురం పక్కి మసీదు వద్ద ఉన్నట్లు సమాచారం అందింది. కాపు కాసి కర్నూలు గనీగల్లీకి చెందిన షేక్ ఇమ్రాన్, మొగల్‌పుర వీధికి చెందిన ఎస్‌ఎండీ ఇర్ఫాజ్, ఖడక్‌పుర వీధికి చెందిన షేక్ జహీన్ అహ్మద్ అలియాస్ జహంగీర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రెండు కుటుంబాల మధ్య గొడవలు, మనస్పర్థలే హత్యకు కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులు కాగా, ఇమ్రాన్, యూసుఫ్‌లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేరానికి ఉపయోగించిన కత్తులు, స్కూటీని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను రిమాండ్‌కు పంపినందుకు దర్యాప్తు అధికారులను డీఎస్పీ అభినందించారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ