
మహానందిలో శాస్త్రోక్తంగా సంప్రోక్షణ పూజలు
మహానంది: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం మహానందిలో సోమవారం ఉదయం సంప్రోక్షణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చందూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారు జామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ ఆలయ శుద్ధి పూజలు చేశారు. అనంతరం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు యథావిధిగా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వరస్వామి దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సీ్త్ర, శిశు సంక్షేమంలో కాంట్రాక్టు పద్ధతిన పోస్టుల భర్తీ
కర్నూలు(అర్బన్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహ, బాలసదన్ల లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు, పార్ట్‌టైం పద్ధతిన భర్తీ చేయనున్నట్లు ఐసీడీసీ పీడీ పి.విజయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
● జిల్లా కేంద్రంలోని శిశు గృహలో సోషల్ వర్కర్ కమ్ ఎర్లీచైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, రెండు ఆయా పోస్టులు (ఈడబ్ల్యూఎస్ –1, ఓసీ మహిళ) ఖాళీగా ఉన్నాయన్నారు.
● పత్తికొండ బాల సదనంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన కుక్ –1 (ఎస్సీ మహిళ), హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ (ఎస్సీ మహిళ), పార్ట్‌టైం పద్ధతిన ఎడ్యుకేటర్ – 1 ( ఓసీ మహిళ ), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (ఎస్సీ మహిళ), ఇన్స్‌స్ట్రక్చర్ కమ్ యోగా టీచర్ – 1 (ఓసీ మహిళ ) పోస్టులు ఉన్నాయన్నారు.
● పెద్దపాడు బాల సదనంలో ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ –1 (ఎస్సీ మహిళ ) పోస్టును పార్ట్‌టైం పద్ధతిన భర్తీ చేస్తామన్నారు.
● ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 17వ తేదిలోగా ( కార్యాలయ పనిదినాల్లో మాత్రమే) ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కలెక్టరేట్‌లోని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్.122లో దరఖాస్తులను అందజేయాలన్నారు. విద్యార్హతలు, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ : htt p://k ur noo .a p.g-o-v.i nÌZ, కార్యాలయ నోటీసు బోర్డులో పరిశీలించాలని ఆమె పేర్కొన్నారు.