
108లో మహిళ ప్రసవం
పాణ్యం: కొండజుటూరు గ్రామానికి చెందిన అనిత గర్భిణి 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా అందులోనే ఆడ శిశువుకు జన్మనించింది. సోమవారం మహిళకు తెల్లవారుజామున పురిటి నొప్పులు రావవడంతో 108కు సమాచారం అందించారు. పాణ్యం 10 8సిబ్బంది గ్రామానికి చేరుకోని నంద్యాల జీజీహెచ్‌కు గర్భిణిని తరలిస్తుండగా 108లోనే ఆడ బిడ్డను ప్రసవించినట్లు ఈఎన్‌టీ తిమ్మయ్య, పైలెట్ చెన్నయ్య తెలిపారు. శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అనతరం వైద్య పరీక్షల కోసం నంద్యాల జీజీహెచ్‌కు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
హత్యాయత్నం కేసులో నిందితుడికి ఏడేళ్లు జైలు
శిరివెళ్ల: కోటపాడుకు చెందిన రాగిపోగుల నారాయణకు హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడినట్లు ఎస్‌ఐ చిన్న పీరయ్య సోమవారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. 2019 జూలై 21వ తేదీన పాత కక్షలను మనస్సులో పెట్టుకొని జాంబుల నడిపి ఓబులేసు అతని స్నేహితులతో గ్రామంలోని లింగమయ్య అరుగు వద్ద కాలక్షేమం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నారాయణ పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఓబులేసు వీపుపై, చేతిపై కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో ఓబులేసు ఎడమ చేతికి గాయమైంది. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు హత్నాయత్నం కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ కోర్టులో జరిగిన పలు దఫాల విచారణలో సాక్షుల విచారణ మేరకు నిందితుడికి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్పి తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ తెలిపారు.
15 నుంచి గాలికుంటు టీకాలు
జూపాడుబంగ్లా: ఈనెల 15 నుంచి పశువులకు గాలి కుంటు టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ అసి స్టెంటు డైరెక్టర్ రామాంజినేయనాయక్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పశువులకు, జీవాలకు గాలికుంటు వ్యాధి వ్యాపించ కు ండా ముందుజాగ్రత్తగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పశుగ్రాసం పెంచుకోవటానికి గాను రాయితీపై పశుగ్రాసం విత్తనాలు రైతుసేవా కేంద్రాలు, పశువైద్యశాలలో అందజేస్తున్నట్లు వివరించారు. సీఎస్‌హెచ్–24రకం పశుగ్రాసం ఐదుకిలోల విత్తనాల ప్యాకెట్ పూర్తి ధర రూ.460 కాగా రాయితీ రూ. 345 కాగా రైతులు కేవలం రూ.115 చెల్లించి విత్తనాలు పొందవచ్చునన్నారు. ఆఫ్రికల్‌టాల్ జొన్నరకం ఐదు కిలోల విత్తనాల ధర రూ.340 కాగా రాయితీ రూ.255 పోను రైతులు కేవలం రూ.85 చెల్లించి పొందవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.