
అ‘పూర్వ’సమ్మేళనం
కలుసుకున్న పూర్వ విద్యార్థులు
ఆదోని సెంట్రల్: పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 52 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. 1973–1974 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులతు ఆదివారం పాఠశాలలో సమావేశమై అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇక్కడ చదువుకుని ఉరువకొండ మాజీ ఎమ్మెల్యేగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న వై.శివరామిరెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందని సీపీఎం నాయకులు రామాంజనేయులు, రెహమాన్ తెలిపారు. అనంతరం తమకు చదువు చెప్పిన గురువులు దస్తగిరి, శ్రీనివాసరావు, నాగరాజుతోపాటు ప్రస్తుత పాఠశాల హెచ్‌ఎం ఫయాజుద్దీన్‌ను సన్మానించారు.