
ఫిజియోథెరపిస్ట్ సూచనలు పాటించాలి
కొన్ని రకాల ఆపరేషన్ల అనంతరం ఫిజియోథెరపీ కీలకం అవుతుంది. ఆపరేషన్ తర్వాత వ్యాయామం లేకపోతే కండరాల్లో ఫైబ్రోసిస్ అభివృద్ధి చెంది వంకర్లు పోతాయి. ఎక్కువరోజులు మంచంపై ఉంటే కాళ్లలో రక్తం గడ్డకట్టి ఎంబాలిజం వచ్చి గుండె, మెదడుకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆపరేషన్‌తో పాటు రోగి సాధ్యమైనంత తొందరగా మామూలు స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ చాలా ప్రధానం. ఇటీవల కాలంలో బైపాస్ సర్జరీ చేయించుకున్న వారికి కూడా ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగులకు ఫిజియోథెరపీ ఒక భాగం చేశారు. ఈ నేపథ్యంలో ఫిజియోథెరపిస్ట్ అందించే సూచనలు పాటించాల్సి ఉంటుంది.
–డాక్టర్ హనీఫ్, ఫిజియోథెరపిస్ట్, కర్నూలు
ప్రస్తుత కాలంలో మనుషుల్లో శారీరక చురుకుదనం తక్కువై పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. యువత నుంచి వృద్ధుల వరకు చాలా మంది భుజం, మెడ, మోకాలు నొప్పి వంటి సమస్యలతో వస్తున్నారు. కండరాల బలహీనతలతో కూడిన నొప్పులను కేవలం మందులతో తాత్కాలికంగా తగ్గించవచ్చు గానీ మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలంటే ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. నొప్పి ఉన్న ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి అవసరమైన శారీరక వ్యాయామాలతో పాటు సహాయక చికిత్సను సైతం అందిస్తారు. దీంతో పాటు ప్రతిరోజూ క్రమం తప్పక వ్యాయామం, నడక చేయాలి. –డాక్టర్ అర్షద్ అయూబ్,
ఫిజియోథెరపిస్ట్, కర్నూలు

ఫిజియోథెరపిస్ట్ సూచనలు పాటించాలి