
632 బస్తాల ఎరువులు సీజ్
గడివేముల: మండల కేంద్రం గడివేములలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఎరువులు దుకాణాలపై దాడులు చేసి 632 ఎరువుల బస్తాల్ సీజ్ చేశారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడటంతో విజిలెన్స్ సీఐ పవన్ కుమార్, డీసీటీఓ వెంకటరమణ తదితరులు మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో యూరియా బస్తా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించి 266 బస్తాలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అదే విధంగా వెంకటేశ్వర ట్రేడర్స్‌లో 20.20.0.13 బస్తాలు 220, దుర్గ భవాని దుకాణీలో 146 బస్తాలు సీజ్ చేశామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొందరు వ్యాపారులు యూరియాను నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.