
ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గత నెల 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రోత్స వాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా రత్నగర్భ గణపతికి, సాక్షిగణపతికి, యాగశాలలో నెలకొల్పిన పంచలోహ వరసిద్ధి వినాయక స్వామికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికా గణపతికి వ్రతకల్పపూర్వక పూజలు చేపట్ట్టారు. గణపతి, జయాదిహోమం నిర్వహించారు. అధికారులు, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికా గణపతిని శుక్రవారం సాయంత్రం నిమజ్జనం చేశారు.